Monday, 29 April 2019

తెలంగాణ లోని అన్ని యూనివర్సిటీ ల ఉమ్మడి పీజీ నోటిఫికేషన్ (CPGET) విడుదల

 

తెలంగాణా రాష్ట్రం లోని అన్ని యూనివర్సిటీ లకు కలిపి 2019-20 విద్యా సంవత్సరానికి గాను పీజీ నోటిఫికేషన్ -CPGET(COMMON POST GRADUATION  ENTRANCE TEST) ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. దీనిలో భాగంగా డిగ్రీ పూర్తి చేసిన మరియు ఫైనల్ ఇయర్ పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు.  ఈ పరీక్ష ఆన్ లైన్ విధానం లో ఉంటుంది.సుమారు 25 కేంద్రాల లో పరీక్ష జరుగుతుంది.
పూర్తి వివరాలను www.ouadmissions.com  లేదా  www.osmania.ac.in , లేదా htttp://tscpget.com  సైట్ ల లో వివిధ యూనివర్సిటీ లు ఆఫర్ చేసే  సబ్జెక్టు లు ,  ఎంట్రన్స్ పరీక్ష సబ్జెక్టు సిలబస్ వంటి పూర్తి వివరాలు ఉంటాయి.
ఇంతకు ముందు ఉస్మానియా,కాకతీయ యూనివర్సిటీ లు వేరు వేరు గా పీజీ నోటిఫికేషన్ లను విడుదల చేసేవి.దీనివల్ల విద్యార్థులు ఒకే సబ్జెక్టు కు ,వేరు వేరు పరీక్ష ఫీజులు వేరు వేరు ఎంట్రన్స్ పరీక్షలు రాయవలసి వచ్చేది.ఇప్పుడు ఈ CPGET వల్ల తెలంగాణ లోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణా, మహాత్మాగాంధీ, శాతవాహన మరియూ పాలమూరు యూనివర్సిటీ లకు ఒక సబ్జెక్టు కు ఒకే అప్లికేషన్, ఒకే పరీక్ష ఉంటుంది.దీనిలో భాగంగా MA, M.COM, M.Sc.కోర్సుల లో చేరడానికి ఈ ఎంట్రన్స్ ఉంటుంది. (ఎంసెట్ పరీక్ష, పాలీ సెట్ ,ఐసెట్ వలే నే ఒక్కొక్క సబ్జెక్ట్ కు  ఉమ్మడి ఎంట్రన్స్ ,ఉమ్మడి రాంక్ లు స్టేట్ వైడ్ , సీట్ల కేటాయింపు ఉంటుంది.)అభ్యర్థి కి వచ్చిన ర్యాంక్ మరియు అతడు ఇచ్చిన ఆప్షన్ ను బట్టి సీట్ అలాట్మెంట్ ఉంటుంది.

 దీని కోసం   ఆన్లైన్ లో అప్లై చేయాలి.
అప్లికేషన్ ప్రారంభ తేదీ        29/4/2019
చివరి తేదీ                           30/5/2019
500 రూపాయల అపరాధ రుసుముతో  8/6/2019 వరకు,2000 రూపాయల అపరాధ రుసుము తో  11/6/2019 వరకు గడువు కలదు.
ఈ  పరీక్షలు  14/6/2019 నుండి 26/6/2019 వరకు  జరుగును.

    ప్రతీ ఒక   సబ్జెక్టు అప్లై చేయడానికి 800 రూపాయలు,SC,ST,PH అభ్యర్థుల కు 600/-
ఒక సబ్జెక్టు అప్లై చేశాక ఇంకా వేరే సబ్జెక్టు కూడా అప్లై చేస్తే అదనంగా 400 రూపాయలు ఒక్కొక్క సబ్జెక్టు కు  అదనపు ఫీజు ఉంటుంది.

మరిన్ని వార్తల కొరకు సందర్శించండి...
www.paatshaalaindia.blogspot.com

0 comments:

Post a Comment